టీపీఎల్ క్రికెట్ టోర్నీ: నిజామాబాద్ నిజామ్స్‌పై మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ స్టార్స్‌ గెలుపు

Sun,March 25, 2018 08:07 PM

mahabubnagar stars wins against nizamabad nizams in tpl tourney

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మహబూబ్ నగర్ స్టార్స్ జట్టు నిజామాబాద్ నిజామ్స్ జట్టుపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగుల స్కోరు సాధించింది. తక్కువ స్కోర్ కే టాప్ ఆర్డర్ కుప్పకూలినా సుశీల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి 84 పరుగులు సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించడంలో సాయం చేశాడు. జవాబుగా బ్యాటింగ్ కు దిగిన నిజామాబాద్ జట్టు 132 పరుగులకు అలౌట్ కావడంతో మహబూబ్ నగర్ జట్టు విజయం సాధించింది.

2531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS