మన కలెక్టర్ .. స్ఫూర్తిదాయకం

Sun,December 24, 2017 03:43 PM

mahabubnagar collector ronald ross

మహబూబ్‌నగర్ : వెనకబడిన జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు ఆచరణలోకి వచ్చాయి. జిల్లాల ఏర్పాటు తర్వాత ఐఏఎస్‌లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ దేశంలోనే ఉత్తమ కలెక్టర్ జాబితాలో నిలిచారు. ప్రతి ఏడాది దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పని చేస్తున్న కలెక్టర్ల ఆశయాలు, పనితీరును గుర్తించి బెటర్ ఇండియా సంస్థ పది మందిని ఉత్తమ ఐఏఎస్‌లుగా ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది జిల్లా కలెక్టర్ దేశంలోని పది మంది ఐఏఎస్‌ల జాబితాలో నిలిచారు. ఆయన ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాలు స్ఫూర్తిదాయక కలెక్టర్‌గా నిలిచేందుకు దోహదపడ్డాయి. వీటిలో ప్రధానంగా బ్రైటర్ మైండ్, దివ్యాంగుల సొసైటీ, వంద శాతం మరుగుదొడ్లను నిర్మాణం చేసే ఓడీఎఫ్ కార్యక్రమంతో పాటుగా హరితహారం ఉన్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా సాగుతున్నాయి. ఆయన చేసిన సేవలే ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

బ్రైటర్ మెండ్..
జిల్లాలో విద్య వెనకబడిం.. బడీడు పిల్లలు బడికి దూరమవుతున్నారు.. బడికి వచ్చే వారు మానసికంగా వెలితితో ఉంటున్నారు. దీంతో చదువు రాకుండా పోతోంది.. ఇది పాలమూరు జిల్లా నివేదికల్లో కనిపించే సాధారణ సూచిక. పాఠశాలలు, విద్యార్థుల చదువులపై ఎన్ని సర్వేలు చేసినా ఆఖరుకు తేలే విషయం ఇదే. దీన్ని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. కానీ.. ఒక్కటి కూడా స్కూల్ మెట్లు దాటలేదు. ప్రస్తుతం జిల్లాలో మంచి విద్య, మానసిక స్థితి, చిన్నప్పటి నుంచే పలు విషయాల్లో చిన్నారులకు శిక్షణ తదితర అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది జిల్లా యంత్రాంగం. కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్వయంగా దీనిపై రంగంలోకి దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో విద్యనందించడం, విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం కల్పించడం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా పలు విధానాలను అమలు చేస్తున్నారు. దీనిలో ప్రధానమైనది బ్రైటర్ మెండ్.. ఇది గొప్ప పట్టణాలకే పరిమితమైన శిక్షణ. విద్యార్థుల మేధోశక్తిని వెలికితీసే ఖరీదైన శిక్షణ. కేవలం సంపన్నవర్గాలు, పెద్ద పట్టణాలకు మాత్రమే పరిచయమున్న దీనికి 30 గంటల శిక్షణకు రూ.13 వేలు. చిన్నప్పటి నుంచే ప్రతి అంశంలో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి.. మానసికంగా దృఢంగా చేసే బ్రైటర్ మైండ్‌ను పాలమూరుకు తీసుకువచ్చారు కలెక్టర్ రొనాల్డ్‌రోస్. ముందుగా కలెక్టర్ ఇద్దరు పిల్లలకు శిక్షణనిప్పించి.. ఆ తర్వాత పేద విద్యార్థుల దగ్గరకు తీసుకువచ్చారు. దీనికోసం కలెక్టర్ క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. రామచంద్రా మిషన్ నుంచి ఒప్పించి కేవలం 10 శాతం ఖర్చుతో బ్రైటర్ మైండ్‌కు శ్రీకారం చుట్టారు. ఒక్కో విద్యార్థికి రూ.1300లతో మాత్రమే ఈ శిక్షణన ఇప్పిస్తున్నారు.

12 పాఠశాలల్లో ప్రారంభం
బ్రైటర్ మైండ్‌ను ముందుగా 12 పాఠశాలల నుంచి ప్రారంభించారు. భూత్పూర్, అడ్టాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మాగనూర్, నారాయణపేట, ధన్వాడ, నర్వ, మద్దూర్ మండలాల కస్తుర్బా పాఠశాలతో పాటుగా నారాయణపేట, మరికల్ గురుకుల పాఠశాలలను ఎంపిక చేశారు. దీనిలో భాగంగా ముందుకు ఆ పాఠశాలల సీఆర్టీలకు ట్రైనింగ్ ఇప్పించి.. విద్యార్థులను బ్యాచ్‌లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో బ్యాచ్‌కు విద్యార్థులకు వారి ఆసక్తిని శిక్షణా కార్యక్రమాలను మొదలు పెట్టించారు. విద్యార్థుల్లో గ్రహణశక్తిని పెంచడం, ఒత్తిడిని తగ్గించేందుకు, విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచడం, జాతీయ నాయకుల జీవిత చరిత్రలను ప్రత్యక్షంగా టీవీల్లో చూపించడం, విద్యార్థులకు క్షుణంగా వివరించడంతో వెనకబడిన విద్యార్థులకు ముందుకు తీసుకువచ్చారు. దీనిపై ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సైతం స్పందించారు. విద్యార్థులను స్వయంగా పరిశీలించి.. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళిక చేస్తామంటూ ప్రకటించారు.

సోలార్ సొసైటీ
దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం దివ్యాంగుల సొసైటీ. జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్ పట్టణ ప్రాంతానికి చెందిన 20 మంది దివ్యాంగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారంటే దానికి ప్రధాన కారణం కలెక్టర్. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మార్చి 8 అంతర్జాతీయ దినోత్సవం రోజు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రారంభించబడిన దివ్యాంగుల సోలార్ ఉత్పత్తుల కేంద్రం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు వారు ఉత్పత్తులు చేసిన ప్యాకెట్ లైట్స్, స్టడీ లైట్స్, ఇతర పరికరాలు మొత్తం 1940 ఉత్పత్తులు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ చేయగలిగారు. గత 2 నెలల కిందట హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనలో కూడా వీరి ఉత్పత్తులకు అద్భుత స్పందన లభించింది. జిల్లాలోని అన్ని కార్యాలయాలతోపాటు అన్ని ప్రాంతాల్లో వీరి ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో వీరు వికలాంగులమనే విషయాన్ని మరిచారు. తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా తమ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. మొత్తం 20 మందితో ప్రారంభమైన దివ్యాంగుల సోలార్ ఉత్పత్తుల కేంద్రంలో తయారు చేసిన వివిధ ఉత్పత్తులకు డీఆర్‌డీఏలోని ఐకేపీ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. గుడుంబా విక్రయాలు మానేసిన వారికి జీవనోపాధుల కింద ఆటోలు పంపిణీ చేయడానికి వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పలు అభివృద్ధి పనుల నిమిత్తం వచ్చిన ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి సందర్శించి వారిని ప్రోత్సహించారు. గతంలో కలెక్టర్‌గా మెదక్‌లో పనిచేసినప్పుడు రొనాల్డ్‌రోస్ అక్కడ కూడా దివ్యాంగుల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వచ్చిన కొద్దికాలంలోనే దివ్యాంగుల సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. దీంతో దివ్యాంగులు జీవితాల్లో మలుపు తిరిగింది. చాలా మంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర ఉత్పత్తులను తయారు చేసేందుకు సంసిద్ధులవుతున్నారు. వైకల్యం ఉందని దిగులు చెందకుండా ఆత్మైస్థెర్యంతో ముందుకు వెళ్తున్న వీరిని చూసి వైకల్యం మోకరిల్లడమే కాకుండా మరెందరో దివ్యాంగులకు మార్గదర్శకులుగా నిలిచేందుకు తోడ్పాటునందించారు కలెక్టర్ రొనాల్డ్‌రోస్.

స్వచ్ఛత వైపు పయనం
బహిరంగ మలవిసర్జనతో కలిగే అనర్థాలు, దుష్ప్రరిణామాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కావడంతో.. ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతునిస్తుంది. దీనిలో భాగంగా 100 శాతం స్వచ్ఛత సాధించిన గ్రామాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. హన్వాడ మండలం సల్లోనిపల్లి, మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామాలు సంపూర్ణ మరుగుదొడ్లు నిర్మాణం చేసిన గ్రామాలుగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నాయి.

వీటితో పాటుగా మెదక్, వరంగల్ జిల్లాలో 100 శాతం స్వచ్ఛతలో ఉన్న గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో 75 గ్రామాలు ఓడీఎఫ్ సాధించారు. ఆ గ్రామాలను చూపిస్తూ జిల్లా అంతటా అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో గ్రామస్తుల కృషి, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రధానంగా వివరిస్తున్నారు. కొన్ని కళాజాతాలతో గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 566 గ్రామాల్లో ఓడీఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 75 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 100 శాతం పూర్తి చేశారు. దీనికోసం కలెక్టర్ ప్రత్యేక నజారానాలు సైతం ప్రకటిస్తున్నారు. సంపూర్ణ స్వచ్ఛత సాధించే గ్రామాలకు ప్రత్యేక నజరానాలు ఇస్తున్నారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయా శాఖల అధికారులను ఓడీఎఫ్‌పైనే బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూరా ఓడీఎఫ్‌ను పరిశీలించేందుకు కలెక్టర్ దృష్టి పెట్టారు. దీంతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సంపూర్ణ స్వచ్ఛ జిల్లాగా చేసేందుకు వచ్చే ఏడాది అక్టోబర్ టార్గెట్ పెట్టుకున్నారు.

ఈ టార్గెట్‌లోగానే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆక్టోబర్ వరకు జిల్లా మొత్తం బహిరంగ మలవిసర్జన జిల్లాగా రూపాంతరం చేసే విధంగా ప్లాన్ వేశారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి 14 లక్షల మొక్కలు నాటారు. దీనిలో ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించారు

2755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles