కాంగ్రెస్ నాయకులను ప్రజలే తరిమికొడతారు: ఎంపీ సీతారాం

Sat,September 23, 2017 12:30 PM

Mahabubabad mp Sitaram Naik press meet in Mahabubabad

మహబూబాబాద్: ఎంపీ సీతారాం నాయక్ ఇవాళ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

340 కిలోమీటర్లు పారే గోదావరిపై ప్రాజెక్టులు కట్టి రైతుల బాధలు తీర్చడం తప్పా.. నిరంతరంగా కరెంట్ ఇవ్వడం తప్పా... 520 గురుకులాలు ఇచ్చి.. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించడం తప్పా..రైతులకు ఎకరానికి రూ.8 వేలు ఇవ్వడం తప్పా..అని కాంగ్రేస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలు ముందు తమ మీద ఉన్న వాటిని తుడుచుకొని మిగితా వారి గురించి మాట్లాడాలని ఎంపీ హితువు పలికారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలన్నారు. పాత వరంగల్ జిల్లాలో మొత్తం స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందన్న కాంగ్రెస్ మాటలు వింటుంటే ప్రజలే కాంగ్రెస్ నాయకులను తరిమికొడతారని ఆయన అన్నారు.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles