వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు.. పోస్టర్ల ఆవిష్కరణ

Wed,February 20, 2019 09:27 PM

maha shivaratri utsavalu posters unveiled in thousand pillar temple

వరంగల్ అర్బన్: చరిత్రాత్మకమైన శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మార్చి 3వ తేదీ నుంచి 7 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఆలయ ప్రాంగణంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు, మండువ శేషగిరిరావు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, పులి రజినీకాంత్‌తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. వేయిస్తంభాల దేవాలయంలో అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ జాగరణ ఉండే భక్తులు కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రథమంగా ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం నుంచి శివరాత్రి రోజున జరిగే రుద్రేశ్వరీ-రుద్రేశ్వరుల కళ్యాణోత్సవాలకి పట్టువస్ర్తాలు అందించడానికి శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు తీర్మానించినట్లు ఆలయ ధర్మకర్త తెలంగాణ ప్రాంత వ్యక్తి గొల్లపుడి శ్రీధర్ తెలిపినట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

2091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles