భద్రకాళి అమ్మవారికి మహాపూర్ణాహుతి

Thu,May 16, 2019 10:15 PM

Maha Purnahuti to bhadrakali ammavaru

-అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్: చారిత్రక ప్రాంతమైన వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ భద్రకాళి అమ్మవారికి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు మంత్రి ఎర్రబెల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రకాళి మాతకు ఉదయం శరభవాహన సేవ, సాయంత్రం పుష్ఫరథ సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉభయదాతలుగా వెలమ సంక్షేమ సంఘం బాధ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ప్రసాద వితరణ చేశారు.

912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles