యుద్ధానికి కత్తితో రావాలి.. కానీ కత్తిని పడేసి పారిపోయారు..

Tue,April 9, 2019 12:41 PM

madhuyashki ran away criticizes TRS MP Kavitha

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీకి చురకలంటించారు. యుద్ధానికి వచ్చే వారు కత్తితో రావాలి.. కానీ కత్తిని పడేసి.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైదానంలో లేకుండా పారిపోయారు అని ఎంపీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కవిత పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నాయన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ అబద్ధాలు మరోసారి రుజువయ్యాయని తెలిపారు. కేంద్రం ప్రజలను మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తాం. మే 1వ తేదీ నుంచి పెన్షన్లు రెట్టింపు కాబోతున్నాయి. స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్‌ ఏర్పాటు జరుగుతుందన్నారు. చక్కెర ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. నియోజకవర్గ పరిధిలో రూ. 900 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ అని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉంటే సైనికులుగా ఉంటాం.. గల్లీలో ఉంటే సేవకులుగా ఉంటామని కవిత ఉద్ఘాటించారు. ప్రజల కోసం పని చేసే పార్టీలను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది అని ఎంపీ కవిత పేర్కొన్నారు.

3549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles