స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

Thu,August 22, 2019 05:28 AM

Low pressure in Bay of Bengal to bring rains in Telangana

హైదరాబాద్ : తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ దాన్ని ఆనుకొని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వర కు ఒడిశా మీదుగా ఉత్తర - దక్షిణ ద్రోణి కొనసాగుతున్నది. తూర్పుమధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్‌ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు, కొన్ని చోట్ల భారీ వానలుకురిశాయి. రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles