ఒకే కాలనీలో ఉండే ఇద్దరు ప్రేమించుకున్నారు..కానీ..

Fri,May 31, 2019 08:33 AM

lovers suicide in ameerpet


హైదరాబాద్ : ఒకే కాలనీలో ఉండే ఇద్దరు ప్రేమించుకున్నారు...అయితే ప్రేమ విషయం యువతి సోదరుడికి తెలియడంతో తల్లిదండ్రులకు చెబుతానని సోదరిని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి ఈ నెల 28న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రియుడు కూడా 29న ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలు సనత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం... కూలీపని చేసుకుని జీవనం సాగిస్తున్న యాదగిరి కుటుంబం, ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ వెంకటేశ్‌ కుటుంబాలు ఫతేనగర్‌లో నివాసముంటున్నాయి.

యాదగిరి కుమార్తె రిషిత (18) కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, వెంకటేశ్‌ కుమారుడు రమేశ్‌ (19) కొరియర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం రిషిత సోదరుడికి తెలియడంతో హెచ్చరించాడు. అంతేగాక తల్లిదండ్రులకు చెబుతానం టూ బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులకు తెలిస్తే గొడవ అవుతుందని ఆందోళనకు గురైన రిషిత 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రియురాలు ఆత్మహత్య విషయం తెలుసుకున్న రమేశ్‌... ఇక తాను కూడా బతకలేనని స్నేహితులతో పలుమార్లు చెప్పాడు. ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే అందరూ చూస్తుండగా నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కిన రమేశ్‌ కిందకు దూ కాడు. చుట్టుపక్కల వారు అతన్ని వెంటనే దవాఖానకు తరలించే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒక్క రోజు తేడాతో ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఫతేనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.

8192
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles