ప్రేమ పేరుతో మోసం ..

Thu,June 13, 2019 08:52 AM

love marriage fraud in hyderabad banjara hills police station limits

బంజారాహిల్స్ : ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని యువతిని సినీ రచయిత మోసం చేశాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... వైజాగ్ ఎంవీపీ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి రమణగౌతం (27) పలు సనిమాల్లో రచయితగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఎన్బీటీ నగర్‌లో నివాసం ఉండే భవానీ సినిమాల్లో అవకాశం కోసం తిరుగుతుంది. ఈ క్రమంలో రమణగౌతంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, ఇద్దరు కలిసి నాలుగేండ్ల పాటు సహజీవనం చేశారు. భవానీ పెండ్లి మాట ఎత్తగానే దాట వేస్తూ వస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న రమణా గౌతం బంజారాహిల్స్‌కు ఆమెను పిలిపించుకొని ఓ గుడిలో తాళికట్టాడు. పెండ్లి అయిన గంటకే అతను అక్కడి నుంచి ఉడాయించాడు. మరుసటి రోజు ఫోన్ చేసి రూ.50వేలు ఇస్తా విడాకులు తీసుకోవాలని సలహా ఇచ్చాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

2274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles