ప్రేమజంట ఆత్మహత్య...

Thu,May 16, 2019 11:40 AM

Love couple suicide in siddipet kondapaka lakudaram

సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తారా (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు. అయినప్పటికీ కనకయ్య, తార ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనంలోకి వెళ్లారు.

ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన కనకయ్య తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాల లోని ఓ గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుకునూరుపల్లి పోలీసులు శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు.

4678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles