ప్రేమ జంట ఆత్మహత్య

Thu,April 18, 2019 10:51 PM

Love couple suicide

తలకొండపల్లి: పురుగుల మందు సేవించి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తాండ్ర వెంకటయ్య పద్మమ్మల కుమారుడు మల్లేశ్ (19) ఇంటర్ మొదటి సంవత్సరం చదివి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాషమోని నర్సింహ, బీమమ్మల కుమార్తె శిల్ప(17) ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో రాత్రి వారిద్దరు గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులు వీరిద్దరూ విగతజీవులుగా పడివుండడాన్ని గమనించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై సురేశ్‌యాదవ్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి దవాఖానకు తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకొన్నాయి. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.

3641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles