ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Mon,April 16, 2018 06:40 PM

Love couple attempted suicide in kumram bheem asifabad district

కుమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని దహెగాం మండలం హత్తినిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హత్తిని గ్రామానికి చెందిన సంధ్య, ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీళ్ల ప్రేమ విషయం సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమె భయపడిపోయింది. ఏం చేయాలో తెలియక నిద్రమాత్రలు మిగింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు సంధ్యను మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే.. సంధ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలుసుకున్న ఆ యువకుడు కూడా నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆ యువకుడిని మంచిర్యాలలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

3014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS