విలువైన పత్రాలు పోతే..

Fri,April 7, 2017 01:00 PM

Lost important documents? Here's what you need to do

నిత్యజీవితంలో అవసరానికి ఉపయోగపడే విలువైన పత్రాలు పోతే.. బాధితులు ఎంతో మదనపడతారు. వాటిని మళ్లీ ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. నిబంధనల ప్రకారం కొద్ది ప్రయత్నంతో వాటిని తిరిగి పొందవచ్చు. రేషన్, ఏటీఎం, ఓటరు గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు పోయినప్పుడు వాటిని ఆయా శాఖల వారీగా ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోవడానికి అందిస్తున్న ప్రత్యేక కథనం...

పట్టాదారు పాస్ పుస్తకం..
భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం పోతే... ముందుగా తమ పరిధిలోని బ్యాంకుల వద్ద నోడ్యూస్, ప్రభుత్వ నోటరీ జారీ చేసే అఫిడవిట్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఇచ్చే పరిశీలన నివేదికతో పాటు రూ.వంద చాలానా తీయాలి. వీటితోపాటు నకలు పాస్ పుస్తకం ఇవ్వాలంటూ తహసీల్దార్‌కు పరిశీలనార్థం ఆర్డీఓకు పంపిస్తారు. ఆయన పరిశీలించిన అనంతరం తహసీల్దార్ 10 రోజుల్లో నకలు పాసు పుస్తకం ఇస్తారు.

రేషన్ కార్డు...
రేషన్ కార్డు పోతే... ఆ నెంబర్ చెప్పి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే.. అక్కడి నుంచి సర్వర్ ద్వారా హైదరాబాద్ కార్యాలయానికి విజ్ఞాపన వెళ్తుంది. అక్కడి నుంచి అనుమతి రాగానే 15రోజుల్లో డూప్లికేట్ కార్డును మీ సేవ కేంద్రంలో పొందవచ్చ. ఒకవేళ కార్డు నెంబర్ లేకపోతే డీలర్ వద్ద కీ రిజిస్టర్‌లో రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది. అక్కడ నెంబర్ పొంది మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత వీఆర్వో విచారణ అనంతరం తహసీల్దార్ ద్వారా తిరిగి మీ సేవ కేంద్రం నుంచి 15రోజుల్లో డూప్లికేట్ రేషన్ కార్డు జారీ చేస్తారు.

పాన్ కార్డు...
పాన్ కార్డు పోయిన వారు.. ముందుగా కార్డుకు సంబంధించిన నకలు కానీ, దాని నెంబర్ తెలిసి ఉంటే గతంలో కార్డుకోసం ఇచ్చిన గుర్తింపు ఆధారాలు కలిపి రెండు ఫొటోలతో ఐటీ కార్యాలయంలో రుసుము ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. దీనితో పాటు మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే కూడా చేసుకొనే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన ఫోన్ నెంబర్‌ను తప్పని సరిగా రాయాలి. ఈ వివరాలను పూణేలోని ప్రధాన కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపిస్తారు. 20రోజుల్లో కార్డును పంపినట్లు, అక్కడి నుంచి బాధితుడికి సమాచారం అందుతుంది. కార్డును తపాలా కార్యాలయం ద్వారా అందజేస్తారు. ఎలాంటి ఆధారాలు లేని వారు.49-ఏ ఫారం, తీసుకొని ఫొటోలు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి మార్కుల మెమో గెజిటెడ్ అధికారి ఆమోదంతో జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి.

ఏటీఎం...
ఏటీఎం కార్డు పోతే.. వెంటనే వివిధ బ్యాంకుల వారీగా టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి విరాలు చెప్పి టోకెన్ నెంబర్ తీసుకోవాలి. తదుపరి ఏటీఎం నెంబర్ బ్లాక్ అవుతుంది. ఇచ్చిన టోకెన్ నెంబర్‌తో డూప్లికేట్ ఏటీఎం నెంబర్ కావాలంటూ ఆయా బ్యాంక్‌ల మేనేజర్లకు దరఖాస్తుతో పాటు రుసుం చెల్లించాలి. విచారణ అనంతరం 10రోజుల్లో ఏటీఎం కార్డు పొందవచ్చు.

టోల్‌ఫ్రీ నెంబర్లు...
ఎస్‌బీఐ :1800441955
ఆంధ్రా బ్యాంక్ : 18004254059
ఐసీఐసీఐ :1800224848
హెచ్‌డీఎఫ్‌సీ : 18004254322

డ్రెవింగ్ లైసెన్స్...
డ్రెవింగ్ లైసెన్స్ పోతే.. కార్డు పైన ఉండే క్రమ సంఖ్య నెంబర్ కీలకం. నామమాత్రపు రుసుమును చెల్లించి ఆర్టీఏ కార్యాలయంలో చెల్లించి కార్డు నెంబర్ చెబితే డూప్లికేట్ లైసెన్స్ పొంద వచ్చు.
ప్రతి ఒక్క లైసెన్స్‌దారుడు జిరాక్స్‌ను ఇంట్లో ఉంచుకోవాలి. అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles