వేములవాడలో వైభవంగా రథోత్సవం

Mon,March 25, 2019 09:03 PM

Lord Shiva Kalyanam Celebrations In Vemulawada

వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో శివకల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు రథోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి, పార్వతీదేవిని, శ్రీ లక్ష్మీసమేత అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. రథాన్ని వివిధ రకాలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. డప్పులు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య, నృత్యాలుచేస్తున్న భక్తుల ఆనందపారవశ్యం మధ్య స్వామిని పురవీధుల గుండా ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

రథంవద్ద వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ స్థానాచార్యులు భీమాశంకర్ స్వామివారి కండువా కప్పి స్వాగతం పలికారు. వేములవాడ పురవీధులన్నీ శివ నామ స్మరణతో మార్మోగాయి. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ రఘుచందర్ గట్టిపోలీస్ బందోబస్తును ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ నామాల ఉమ, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కౌన్సిలర్లు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles