నేడు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్

Fri,November 24, 2017 07:30 AM

looms modernization mela at Sircilla

రాజన్న సిరిసిల్ల : మరమగ్గాల పరిశ్రమను అభివృద్ధి చేయడంతోపాటు కార్మికులకు చేతినిండా పని దొరికేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు తయారు చేసి విపణిలో తెలంగాణ కీర్తిని చాటేందుకు సాంచాల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సిరిసిల్లలో శుక్ర, శనివారాల్లో మరమగ్గాల ఆధునీకరణ మేళాను నిర్వహిస్తున్నది. పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ మేళాను ప్రారంభించనున్నారు. రాష్ట్ర సుమారు వెయ్యి మంది పారిశ్రామికవేత్తలు, యజమానులు దీనికి హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 15 కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి.

902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles