27న మగ్గం.. తెలంగాణ వస్త్ర షో

Tue,September 25, 2018 06:41 AM

Loom and Telangana Textile Show on this 27th

హైదరాబాద్: నగరంలోని ఎన్-కన్వెన్షన్‌లో 27న మగ్గం.. తెలంగాణ వస్త్ర ప్రదర్శన జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ ఎం.రాజమహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ చేనేత కార్పొరేట్, అత్యాధునిక ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న అనేక ఉత్పత్తులను ప్రపంచానికి చాటేందుకు ఈ వస్త్ర ప్రదర్శన ఉండనుందన్నారు. ఈ ప్రదర్శనలో పలువురు మోడళ్లు ఈ వస్ర్తాలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారని చెప్పారు. గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేనేత వస్ర్తాల తయారీ దారులకు చేయూతనందించే ఉద్దేశంతో సీబీఎండీ సంస్థ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందన్నారు. 27న సాయంత్రం 5 గంటలకు ఎన్ కన్వెన్షన్‌లో జరిగే ఈ మగ్గం.. తెలంగాణ వస్త్ర షోకు కేంద్ర మంత్రులు చేనేత జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానితో పాటు మరో కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌లు హాజరవుతున్నారని తెలిపారు. ఆధునిక ట్రెండ్లు, ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారులు ఏ విధంగా ఆధునిక డిజైన్లను రూపొందిస్తున్నారనే విషయం ప్రపంచానికి చాటేలా ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు.

1981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles