రవిప్రకాశ్, శివాజీకి లుక్ ఔట్ సర్క్యులర్ జారీ

Sat,May 18, 2019 12:03 PM

lookout circular issued to raviprakash, shivaji


హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీకి సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ సర్య్కులర్ జారీ చేశారు. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని..విచారణకు హాజరుకాలేమని రవిప్రకాశ్, శివాజీ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం పంపారు. విచారణకు హాజరయేందుకు మరో 10 రోజులు గడువు కావాలని కోరారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు..ఈ మేరకు లుక్ ఔట్ సర్య్కులర్ జారీచేశారు.

రవిప్రకాశ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్‌సీఎస్‌టీలో కేసు కోసం పాత తేదీల్లో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. శక్తి, ఎంకేవీఎస్ మూర్తి, రవిప్రకాశ్, హరి మధ్య బదిలీ అయిన పలు ఈ మేయిళ్లను సైబర్ క్రైం పోలీసులు వెలికితీశారు. ఈ మేయిళ్లు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు తొలగించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో తొలగించిన ఈ మెయిళ్లను సైబర్‌క్రైం పోలీసులు వెలికితీశారు.

2501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles