చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

Mon,March 25, 2019 08:27 PM

lok sabha election nomination time ending

హైదరాబాద్: లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైయ్యాయి. రేపు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 తుది గడువు. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటి వరకు 699 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఇంకా నామినేషన్లు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్ స్థానానికి 245 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.96 కోట్లు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.10.09 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. రూ.2.04 కోట్ల విలువైన మద్యం, 2.45 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం.

నిజామాబాద్‌లో రైతుల నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించలేదు. తెలంగాణ పాకిస్థానా.. అన్న పవన్ కళ్యాన్ వ్యాఖ్యలపై పరిశీలిస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇచ్చారు. నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థి తరపున నలుగురు మాత్రమే హాజరుకావాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,96,97,269. అందులో పురుష ఓటర్లు 1,49,19,751 కాగా, 1,47,76,024, ఇతరులు 1504 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles