HomeLATEST NEWSlocal body mlc elections votes counting started

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

Published: Mon,June 3, 2019 08:10 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 31న ఎన్నికలు నిర్వహించగా.. మొత్తం 2,799 ఓట్లకుగానూ 1,958 ఓట్లు పోలయ్యాయి.

వరంగల్ నియోజకవర్గం లెక్కింపు ఏనుమాముల మార్కెట్‌లో, రంగారెడ్డి జిల్లా ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీలో, నల్లగొండ ఎమ్మెల్సీ నియోజకవర్గం లెక్కింపు దుప్పలపల్లి వేర్‌హౌసింగ్ గోదాంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉన్న ఓట్లు, పోలైన ఓట్ల జాబితాను పరిశీలించనున్నారు. తర్వాత 25 ఓట్ల చొప్పున బండిల్స్ చుట్టి, లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి 797 ఓట్లు మాత్రమే పోల్ కావడంతో ఫలితం త్వరగా తేలనున్నట్టు తెలుస్తున్నది. తర్వాత వరంగల్, చివరకు నల్లగొండ ఫలితాలు రానున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా జిల్లాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

-బరిలో 9 మంది


మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి.. నల్లగొండలో టీఆర్‌ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీచేశారు. వరంగల్ స్థానం నుంచి అయిదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తున్నారు.
1149
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology