స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడే..

Mon,June 3, 2019 07:17 AM

local body mlc elections counting will start today at 8 am

ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి.. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మే 31న ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 806 ఓట్లకు గాను 797 ఓట్లు పోలయ్యాయి.

వరంగల్ జిల్లాకు సంబంధించి ఎనుమాముల మార్కెట్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం ఉన్న 902 ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి.

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1086 ఓట్లకు గాను 1072 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రెండు గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles