బీసీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Thu,April 5, 2018 08:30 AM

హైదరాబాద్ : బీసీ కార్పొరేషన్ అందించే రుణాలకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలని, వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించి ఉండరాదని పేర్కొన్నారు. కేటగిరి-1లో లక్ష రూపాయల రుణానికి 80 శాతం రాయితీ, కేటగిరి-2లో రూ. 2 లక్షలకు 70 శాతం, కేటగిరి-3లో రూ. 2 నుంచి రూ.12 లక్షల రుణానికి 60 శాతం(రూ. 5 లక్షలకు మించకుండా) రాయితీ వర్తిస్తుందని వివరించారు. దరఖాసులు ఈ నెల 21వ తేదీ లోపు GTTPS.TS.OBMMS.CGG.GOV.IN వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సూచించారు. 2015-16 సంవత్సర ఆర్థిక ప్రణాళికలో దరఖాస్తులు చేసి రాయితీ రుణాల పొందే అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

18390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles