బ‌ల్లి ప‌డిన చికెన్ బిర్యానీ తిని..

Fri,June 22, 2018 09:22 PM

lizard Found in  Chicken biryani

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయవాడ నగరంలో గ‌ల ఓ ప్ర‌ముఖ హోటల్‌లో వినియోగ‌దారుల‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. హోటల్‌లో త‌యారు చేసిన బిర్యానీ తిని ఇద్ద‌రు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి హోట‌ల్ నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్యమే కార‌ణం. ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో పాటు వారు వాంతులు చేసుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం ద‌గ్గ‌ర‌ల్లోని హాస్పిట‌ల్‌కు తరలించారు. హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంపై వినియోగదారులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బల్లి పడిన బిర్యానీ వ‌డ్డించిన హోట‌ల్‌ను పరిశీలించారు. అందులోని కిచ్‌ను కూడా తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను తయారీ చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు ఆహార పదార్ధాల శాంపిళ్లను సేకరించి, హోటల్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు.

5775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles