భార్య హత్య..భర్తకు జీవితఖైదు

Fri,May 3, 2019 07:16 AM

lifeterm imposed to husband in wife murder case

రంగారెడ్డి : అదనపు కట్నం కోసం భార్యను హింసించి హత్య చేసిన కేసులో నిందితుడు శివరామకృష్ణకు ప్రకారం జీవితఖైదు, రూ.1500 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 2వ అదనపు జిల్లా జడ్జి వెంకటశేషుబాబు గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూటర్‌ సి.రాము కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివరామకృష్ణకు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీగంగాభవానీతో 2011లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.2లక్షలు కట్నంగా తీసుకున్నాడు.

ఉద్యోగరీత్యా శివరామకృష్ణ హైదరాబాద్‌ జీడిమెట్ల ప్రాంతంలో భార్యతో కలిసి నివసించేవాడని, తరుచూ అదనపు కట్నంకోసం భార్య లక్ష్మీగంగాభవానీని శారీరకంగా, మానసికంగా హింసించేవాడని వివరించారు. 21 జనవరి 2013రోజున నిందితుడు శివరామకృష్ణ భార్యను అదనపు కట్నం కోసం వేధించి గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో పెట్టి నర్సాపూర్‌ రోడ్డులోని అటవీ ప్రాంతంలో పడవేశాడని తెలిపారు. గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు విచారణ చేసి, కేసు కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ అనంతరం కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించినట్లు పేర్కొన్నారు.

1685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles