లాయర్ హత్య కేసులో..10 మందికి జీవితఖైదు

Sat,March 16, 2019 08:25 AM

Life imprisonment for 10 people in Advocate Ashok Reddy murder case

రంగారెడ్డి : 2011 సంవత్సరంలో నగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ అశోక్‌రెడ్డి హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. హత్యతో సంబంధం ఉన్న 10 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఎల్‌బీనగర్ 13వ ఏడీజే కోర్టు తీర్పునిచ్చింది. చందానగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడాలోని సర్వే నంబర్లు 50, 61, 74లోని 3.19 ఎకరాల భూమికి సంబంధించి స్థానికులైన ఈ సంజీవరెడ్డి, ఎస్.ప్రతాప్‌రెడ్డి, దశరథరెడ్డిలకు మధ్య భూవివాదం తలెత్తింది. అయితే సంజీవరెడ్డి తరఫున నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది శేరి అశోక్‌రెడ్డి వారి భూమి కేసును పర్యవేక్షిస్తున్నాడు. 2011 మార్చి నెలలో సంజీవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అదే నెల 26వ తేదీన ఉదయం భూమి జప్తుకు సంబంధించి తహసీల్దార్‌ను కలిసేందుకు శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. అయితే అప్పటికే అశోక్‌రెడ్డి అక్కడకు వస్తున్నాడని తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి మరో ఐదు మందితో తహసీల్దార్ కార్యాలయం వద్ద కాపు కాశారు. అశోక్‌రెడ్డి అక్కడకు చేరుకుని కారు దిగుతుండగా, ప్రతాప్‌రెడ్డి, అతని అనుచరులు న్యాయవాది కళ్లల్లో కారం చల్లారు. అనంతరం కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కాగా, అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ 13 ఏడీజే కోర్టులో కేసు విచారణ కొనసాగుతుంది. ఎట్టకేలకు సదరు 10 మంది నిందితులను దోషులుగా గుర్తిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

1634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles