క్యాన్సర్ బాధితులకూ ఎల్‌ఐసీ బీమా!

Wed,November 15, 2017 12:41 AM

LIC insurance for cancer victims

చెన్నై : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ).. క్యాన్సర్ బాధితుల కోసం ఓ ఆరోగ్య బీమా పాలసీని ప్రకటించింది. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల శ్రేణిలో కవరేజీ ఉండేలా ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. 20 నుంచి 65 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారు అర్హులని తెలిపింది. సంవత్సరం, ఆర్నెళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను ఇస్తున్నామని ఓ ప్రకటనలో ఎల్‌ఐసీ పేర్కొంది. నిర్ణీత పాలసీ వ్యవధిలో బీమా పొందినవారు క్యాన్సర్ బారినపడ్డారని తేలితే నిర్ణయించిన షరతుల ప్రకారం ప్రయోజనాలు పొందగలరని తెలిపింది.

2229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS