సుమన్ గెలుపు కోసం కలిసి పనిచేద్దాం: నల్లాల ఓదేలు

Thu,September 13, 2018 10:09 PM

Let's work together for Suman victory says nallala odelu

హైదరాబాద్: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అన్యాయం జరగదని.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ మాటే తమకు శిరోధార్యమన్నారు. రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 2001 నుంచి ఇప్పటి వరకు నిబద్ధతతో పని చేశానని సీఎం అన్నారు. . సీఎం కేసీఆర్‌తో కలిసి జీవిత కాలం పని చేస్తా. ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సుమన్ గెలుపు కోసం అందరం కలిసి పని చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.

12471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles