ఇక్రిశాట్‌లో చిరుతపులి సంచారం

Mon,February 11, 2019 04:55 PM

Leopard Wandering in Patancheru ICRISAT

సంగారెడ్డి: పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో చిరుతపులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా చిరుతపులి సంచారాన్ని ఇక్రిశాట్‌ సిబ్బంది గమనిస్తున్నారు. నిన్న రాత్రి చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. దీంతో ఇక్రిశాట్‌ సిబ్బంది, పరిసర ప్రాంతాల కాలనీవాసులు భయాందోళనకు గరవుతున్నారు. చిరుత భయానికి ఇక్రిశాట్‌లో పనిచేయడానికి కూలీలు వణికిపోతున్నారు. అటవీ అధికారులు ఇక్రిశాట్‌లో బోను ఏర్పాటు చేశారు. మరో రెండు బోనులను మెదక్‌ నుంచి తెప్పిస్తున్నారు. 2014లో కూడా అటవీ అధికారులు ఇక్రిశాట్‌లో చిరుత పులిని పట్టుకున్నారు.

2130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles