చిరుతపులి చర్మం పట్టివేత

Sun,March 24, 2019 10:58 PM

leopard skin seized in mancherial

-పోలీసుల అదుపులో ముగ్గురు
-రహస్యంగా విచారణ చేస్తున్న సీసీఎస్ పోలీసులు

మంచిర్యాల: గత కొద్ది రోజులుగా పులి, చిరుతపులికి సంబంధించిన మరణాలు మరచిపోకముందే మరో మరణం వెలుగులోకి వచ్చింది. వేమనపల్లిలో ప్రాణహిత తీరం వద్ద పోలీసులు ఒక చిరుత పులి చర్మాన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులు ఉన్న ముఠా ఒకటి చిరుతపులి చర్మంతో వస్తుండగా రామగుండం కమిషనరేట్ సీసీఎస్ పోలీసులకు పక్కా సమాచారం అందగా వారికి అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చర్మం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యులు ఉన్న ముఠాలో కేవలం ముగ్గురు మాత్రం పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ చిరుతపులి ఎక్కడిది? ఎవరికి చర్మం విక్రయించేందుకు తీసుకొస్తున్నారే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠాను పోలీసులు శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles