చిరుత దాడిలో లేగదూడ మృతి

Mon,April 1, 2019 10:42 AM

leopard attacks calf in kadthal

రంగారెడ్డి: జిల్లాలోని కడ్తాల్ సమీపంలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. కడ్తాల్ సమీపంలో గత 40 రోజులుగా చిరుతపులి సంచారం చేస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడిలో ఇప్పటికే 10 లేగ దూడలు మృతి చెందాయి. వరుసగా చిరుత దాడులు చేస్తుండటంలో చుట్టు పక్కన గ్రామాల రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు ఇప్పటికే ఐదు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. అయితే.. చిరుత బోన్లకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది. రెండు లేదా మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles