లేగదూడపై చిరుత దాడి

Thu,May 9, 2019 10:55 AM

leopard attack on cat in Kadtal mandal

రంగారెడ్డి : కడ్తాల్‌ మండలం ఎక్వాయిపల్లిలో లేగదూడపై చిరుత పులి దాడి చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు లేగదూడలపై చిరుత దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కడ్తాల్‌, యాచారం, కందుకూరు మండలాల పరిధిలో గత 3 నెలల నుంచి చిరుత సంచరిస్తుందని వారు చెప్పారు. ఈ మూడు నెలల కాలంలోనే 17 లేగదూడలపై చిరుత దాడి చేసి హతమార్చింది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చిరుతను బంధించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడ్తాల్‌, గోవిందాయపల్లి, ముద్విన్‌, చరికొండ, కొర్షకొండ, కొత్తపల్లి, మేడిపల్లిలో బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ చిరుత దొరకడం లేదు.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles