కాసేపట్లో శాసనసభ్యుల కోటా మండలి ఎన్నికల ఫలితాలు

Tue,March 12, 2019 06:20 PM

Legislative Council MLC election results announce soon

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలాతాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్-1లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 91 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం బరిలో ఉండగా ఎంఐఎం పార్టీ నుంచి మిర్జా రియాజుల్ హసన్ ఇఫెండి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది.

1556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles