అసత్య ఆరోపణలపై డీజీపీకి ఫిర్యాదు

Tue,April 16, 2019 07:10 AM

lAXMI PARVATHI COMPLAINTS TO DGP ON FAKE ALLEGATIONS


హైదరాబాద్ : తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఎస్సార్‌సీపీ నాయకురాలు లక్షీ పార్వతీ ఆరోపించారు. తనపై సోషల్‌ మీడి యాలో అసత్య ఆరోపణలు చేస్తున్న కోటిపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌర పరుస్తూ విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్‌ 4వ తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరచారని తెలిపారు. కోటిని బిడ్డలాగా భావించానని, కోటి మాత్రం పనిగట్టుకుని తనపై విమర్శలు చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసిన కోటితోపాటు ప్రచారం చేసిన మీడియా ఛానల్‌, యాంకర్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న కుట్రను ఛేదించి, తన ప్రతి ష్టను కాపాడాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles