‘సర్కారు దవాఖానాల్లో కాన్పులు పెంపునకు చర్యలు’

Tue,May 2, 2017 03:00 PM

laxmareddy says about delivery in govt hospitals


హైదరాబాద్: సర్కారు దవాఖానాల్లో కాన్పులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తామన్నారు. నీలోఫర్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి..అక్కడి సౌకర్యాలపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ప్రసవాల కోసం సర్కారు దవాఖానాల్లో కొత్తగా 26 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని త్వరలో నియమిస్తామని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles