ఆయుర్వేద వైద్యం అభివృద్ధికి చర్యలు : లక్ష్మారెడ్డి

Tue,October 17, 2017 04:09 PM

laxmareddy says about Ayurveda treatment


హైదరాబాద్‌: ఆయుర్వేద వైద్యం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో రెండో జాతీయ ఆయుర్వేద దినోత్సవానికి మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఆయుర్వేద కళాశాలలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆయుర్వేదంపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన సదస్సులు పెడితే అక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles