‘2కే రన్‌’లో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి

Thu,October 13, 2016 10:34 AM

laxmareddy participates in 2k run


హైదరాబాద్: ఇవాళ ప్రపంచ కంటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కేబీఆర్ పార్క్ వద్ద 2కే రన్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2020 నాటికి అంధత్వాన్ని నివారించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళుతుందని తెలిపారు. ముందస్తుగా గుర్తిస్తే దృష్టి లోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చన్నారు. కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. 2కే రన్‌లో వివిధ కాలేజీల విద్యార్థులు, డాక్టర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles