108 వాహనాల కొనుగోళ్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు!

Mon,December 31, 2018 01:29 PM

Laxma Reddy Sensational Comments On ap cm chandrababu naidu

రంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 వాహనాల కొనుగోళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి ఆరోపించారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ కంటే రూ.4లక్షలు ఎక్కువ పెట్టి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలతోనే చంద్రబాబు అవినీతి మొదలైందని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి నిధులు తెచ్చి దోచుకున్నారని మండిపడ్డారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ప్రచారం చేస్తామన్నారు.

998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles