చెప్పింది గోరంత..బయట పడుతోంది కొండంత: రామారావు

Fri,September 28, 2018 11:59 AM

హైదరాబాద్: రేవంత్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదులో తాను చెప్పింది గోరంతా అని కానీ ఐటీ అధికారుల సోదాల్లో బయటపడుతుంది కొండంత అని న్యాయవాది రామారావు అన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలపై ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ.. 19 డొల్ల కంపెనీలు, రూ. 400 కోట్ల అక్రమార్జనపై ఆధారాలతో ఫిర్యాదు చేశా. సాయిమౌర్య కంపెనీ ద్వారా అక్రమాలు జరిగాయి. ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఈ అక్రమాలు బయటపడ్డాయి. రెండు నెలలు ఇన్వెస్టిగేషన్ చేశా. నోటీసులకు సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనడం సరికాదు. అక్రమార్జన చేసిన రేవంత్‌కు మద్దతు తెలపడం సరికాదు. ఢిల్లీ నుంచి స్పెషల్ టీమ్ రేవంత్‌రెడ్డి ఇండ్లలో సోదాలు చేసింది. రేవంత్ ట్యాక్స్‌లను ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. అధికారుల సోదాల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలు ఊడా తానే బయటకు తీసినట్లు తెలిపారు. ఉప్పల్‌లో భూ దందా కూడా బయటపడిందని పేర్కొన్నారు. కాగా లాకర్లు తెరిచేందుకు రేవంత్‌రెడ్డి భార్య గీతను ఐటీ అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్లకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు తెలుసుకోనున్నారు.

5263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles