రేపటినుంచి లాసెట్ కౌన్సెలింగ్

Sun,October 21, 2018 09:33 AM

Lawcet counselling starts from tomorrow

హైదరాబాద్: లాసెట్-2018 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజ్, కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన సహాయకేంద్రాల్లో 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు లాసెట్ కన్వీనర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి సర్టిఫికెట్లు పరిశీలిస్తామని చెప్పారు. 23 నుంచి 26 వరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ (ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ) చేపడతామన్నారు. వెబ్‌ఆప్షన్ల మార్పుకోసం 27 సాయంత్రం 5 గంటలవరకు అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తివివరాల కోసం http://lawcetadm.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles