న్యాయవాద ఉపాధ్యాయులకు లా ప్రాక్టీస్‌కు అవకాశం!

Fri,February 22, 2019 08:04 AM

హైదరాబాద్: న్యాయవాద ఉపాధ్యాయులు సైతం కోర్టుల్లో లా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించేలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోరాలని నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్షియం కమిటీ (ఎన్‌ఎల్‌యూఎస్) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నల్సార్ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి సమయం న్యాయవాద ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారుసైతం కోర్టుల్లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతికోరాలని నిర్ణయించినట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, ఎన్‌ఎల్‌యూఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా తెలిపారు. ఈ విధానంతో పుస్తకాల్లోని న్యాయవాద వృత్తిగత అంశాల బోధనకు, క్షేత్రస్థాయి అంశాలకు మధ్య వారధి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ బార్ కౌన్సిల్ అనుమతించకపోతే న్యాయవాద ఉపాధ్యాయులకు 25 శాతం నాన్‌ప్రాక్టీసింగ్ అలవెన్సు కోరాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles