నిర్మలా సీతారామన్ వచ్చినప్పటి నుంచే..

Fri,August 10, 2018 01:40 PM

Land Replacement file stay due to nirmala sitharaman says trs MPs

ఢిల్లీ: నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రక్షణశాఖ భూముల బదలాయింపు ఫైల్ ప్రక్రియ ముందుకు కదలడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్ ఎంపీలు నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న సచివాలయం, శాసనసభ గురించి ప్రధానికి వివరించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బైసన్, జింఖానా స్థలాన్ని ఇవ్వాలని అనేకసార్లు కోరాం. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ ప్రధానితో అనేకమార్లు చర్చించారు. అప్పటి రక్షణశాఖ మంత్రులు స్థల బదలాయింపుపై క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. బైసన్‌పోల్ ల్యాండ్‌కు బదులు స్థలం, రూ. 95 కోట్లు ఇవ్వాలని కేంద్ర రక్షణశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ప్రతి ఏటా రూ. 35 కోట్లు ఇవ్వాలని రక్షణశాఖ కోరింది. కాగా రూ. 35 కోట్లకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో హైలెవర్ కమిటీ సైతం భూమిని బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ సూచనతో జవహార్‌నగర్‌లో దాదాపు 560 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాగా రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ వచ్చినప్పటి నుంచి ఫైల్ ముందుకు సాగడం లేదు. అదే కర్ణాటక ప్రభుత్వం అడగగానే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించకుండా ఆలస్యం చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త మెలికతో స్థలాలు ఇవ్వకుండా రక్షణశాఖ మంత్రి ఆలోచన చేస్తున్నారు. బైసన్‌పోలో స్థలం, కంటోన్మెంట్ ఏరియా స్థలానికి సంబంధించి వేర్వేరుగా లేఖలు ఇవ్వాలనడం సరికాదని పేర్కొన్నారు.

2289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles