పెద్ద చెరువు మత్తడి దుమికే..

Wed,October 17, 2018 11:37 PM

lakes under srsp projects are filled with water

గోదారమ్మ రాకతో చెరువులకు జలకళ
తొర్రూరు: వర్షాభావంతో అల్లాడుతున్న ప్రాంతాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన గోదావరి జలాలు వరప్రదాయినిగా మారాయి. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సుమారు 10 రోజుల క్రితం ఎస్సారెస్పీ రెండో దశకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయించారు.

మైలారం రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు నిండిన తర్వాత తొర్రూరు మండలంలోని చెరువులను నింపేందుకు నీటిని వదిలారు. ఈ క్రమంలో డీబీఎం-59 పరిధిలో ఉన్న అమ్మాపురం పెద్ద చెరువు బుధవారం గోదావరి జలాలతో నిండి మత్తడి దూమికింది. ఈ నీరు నేరుగా కంఠాయపాలెం చెరువులోకి చేరుతోంది. 180 ఎకరాల ఆయకట్టును కలిగి ఉన్న అమ్మాపురం పెద్ద చెరువు కింద ప్రస్తుతం వంద ఎకరాలకు పైబడి సాగు జరుగుతోంది. ఇప్పుడు గోదావరి జలాల రాకతో యాసంగి పంటలకు ఎంతో ఊతమిస్తుందని రైతులు ఆనందపడుతూ కేసీఆర్, దయాకర్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు.

2364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS