పనిచేస్తున్న సంస్థకు టోకరా..లక్షల్లో మోసం

Tue,April 16, 2019 07:26 AM

Lacks of rupees fraud in Banjarahills


బంజారాహిల్స్‌ : పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసి లక్షలాది రూపాయల మోసానికి పాల్పడ్డ వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, హెయిర్‌ క్లినిక్స్‌ సంస్థ ‘ఎస్‌ఎర్‌ఎస్‌ వెల్‌నెస్‌ కంపెనీ’ బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 10లో ఏడాది క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రంలో పనిచేసేందుకు సీహెచ్‌.రాఘవేంద్రను రీజినల్‌ మేనేజర్‌గా, అతడి భార్య వాణి రామానుజంను క్లినిక్‌ మేనేజర్‌గా నియమించారు. అదే ఏడాది నవంబర్‌లో జమ్ము అనిల్‌ అనే వ్యక్తిని హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా...విజయవాడకు చెందిన సూర్యదుర్గా ప్రసాద్‌ భాను అనే వ్యక్తికి విజయవాడలో బ్రాంచ్‌ పెట్టుకునేందుకు అనుమతి ఇస్తున్నామని, తామే సంస్థ యజమానులమంటూ నమ్మించిన సంస్థ రీజినల్‌ మేనేజర్‌ రాఘవేంద్ర, అతడి భార్య వాణి రామానుజమ్‌ రూ.10లక్షలు వసూ లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరులోని సంస్థ యజమాని రాజారామ్‌ నగరానికి వచ్చాడు. తమ సంస్థలోని లావాదేవీలను తనిఖీ చేయగా సుమారు రూ.25లక్షల మేర మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ మేరకు సంస్థను మోసం చేయడంతో పాటు ఫోర్జరీ పత్రాలను సృష్టించి డబ్బు లు దండుకున్న రాఘవేంద్రతో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles