కాంగ్రెస్ టికెట్ కోసం 3 కోట్లు డిమాండ్.. ఆడియో

Thu,November 15, 2018 04:55 PM

kyama mallesh fire on congress party leadership

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ టికెట్ల కోసం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ ఒక్కో నియోజకవర్గం నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తనకు ఇబ్రహీంపట్నం స్థానం కేటాయించేందుకు భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని స్పష్టం చేశారు. తన కుమారుడు అంజన్‌తో పాటు మరొక సన్నిహితుడిని సాగర్ వద్దకు పంపితే.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు కన్ఫామ్ చేస్తామని సాగర్ చెప్పినట్లు మల్లేష్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆడియోను క్యామ మల్లేష్ ఇవాళ విడుదల చేశారు.


ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్సే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. కేసీఆర్ విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. సీట్ల కేటాయింపులో యాదవులు, కుర్మలకు అన్యాయం జరిగింది. ముడుపులు తీసుకోని కాంగ్రెస్ టికెట్లు పంచింది. స్క్రీనింగ్ కమిటీ వ్యవహారం కంచె చేను మేసినట్టు ఉంది. రాజకీయంలో ఉండి డబ్బు, వయస్సు, జీవితం పొగొట్టుకున్నాను. అధిష్టానానికి తెలియజేయాలని మీడియా ముందుకు వచ్చాను. రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియా దృష్టికి కూడా తీసుకెళ్తే బయటపెట్టొదన్నారు. తర్వాత మాట్లాడుదామని సర్ది చెప్పారు. రూ. 5 కోట్లతో మొదలు పెట్టి రూ. 4 కోట్లకు ఫైనల్ చేస్తున్నారు. బంధువర్గానికే సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని క్యామ మల్లేష్ ధ్వజమెత్తారు.


3807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS