సభ్యత్వ నమోదుపై నేడు కేటీఆర్ సమీక్ష

Mon,July 22, 2019 09:28 AM

KTR will reviews TRS membership drive today

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి పార్టీ నియోజకవర్గ సభ్యత్వ ఇంచార్జీలు, డాటా ఎంట్రీ ఇంచార్జీలు హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అయిన సభ్యత్వ నమోదు వివరాలు, డాటా ఎంట్రీ జరిగిన సభ్యత్వ నమోదు, ఇతర వివరాలన్నింటిని సమావేశంలో సమీక్షిస్తారని చెప్పారు.

390
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles