18న 2వేల స్కూళ్లతో శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌త్యేక స‌మావేశం

Sun,July 16, 2017 04:46 PM

KTR will meet schools principals and teachers on 18 july

హైదరాబాద్ : న‌గ‌రంలో త‌డి, పొడి చెత్త వేరు చేయ‌డంపై చైత‌న్యం క‌ల్పించ‌డానికి ఈ నెల 18వ తేదీన న‌గ‌రంలోని 2వేల పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని శిల్ప‌క‌ళావేదిక‌లో జీహెచ్ఎంసీ, ఐటిసి సంస్థ‌లు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జాతీయ స్థాయిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగ నిపుణులు ఆల్‌మిత్ర ప‌టేల్‌, స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి న‌వీన్‌మిట్ట‌ల్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిషోర్‌, పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ జి.కిష‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

వ్య‌ర్థాల నుంచి సంప‌ద తీసే వావ్‌ క్ల‌బ్‌ల‌ను హైద‌రాబాద్‌లోని 2వేల పాఠ‌శాల‌ల్లో ఈ సంద‌ర్భంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డానికి బాల‌స్వ‌చ్ఛాగ్ర‌హిల‌ను కూడా ఈ స‌మావేశంలో ఏర్పాటు చేస్తారు. డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియోద్దీన్‌, స్థానిక ఎంపి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీలు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌ని నిర్వాహ‌కులు తెలియ‌జేశారు.

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles