టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేపు బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్

Sun,December 16, 2018 06:00 PM

ktr to take responsibilities of trs working president tomorrow in telangana bhavan

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ రేపు ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లను టీఆర్‌ఎస్ నేతలు తలసాని, దానం నాగేందర్, ఇతర నాయకులు పరిశీలించారు. రేపు ఉదయం 10.15 గంటలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ పూలమాల వేసి ప్రసంగిస్తారన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన ఈ ర్యాలీకి తరలిరానున్నట్టు తలసాని తెలిపారు.

1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles