నీటిని నిల్వ చేసుకోవడం ఎంతో అవసరం:కేటీఆర్

Wed,September 14, 2016 08:27 PM

ktr says about water saving


హైదరాబాద్: తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని బట్టి నీటిని నిల్వ చేసుకోవడం ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో జరిగిన ఇంజినీర్స్ డే సెలబ్రేషన్స్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ ద్వారా వేలాది మంది ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుంటున్నమని తెలిపారు. జనాభా అవసరాలకు తగినట్టుగా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్కసుమన్ పాల్గొన్నారు.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles