రూ.20 వేల కోట్లతో నగర రోడ్ల అభివృద్ధి : కేటీఆర్

Wed,October 18, 2017 09:32 PM

kTR SAYS ABOUT HYDERABAD ROADS DEVELOPMENTS


హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని రోడ్ల కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టాస్క్ ఫొర్స్ ప్రస్తుతం నగర రోడ్లను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం సూచించడంతోపాటు, రోడ్ల మరమ్మతులు, నూతన ప్రాజెక్టులను సమన్వయం చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితిపై జలమండలిలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సుమారు 20 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రోడ్ల కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో పురపాలక శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైల్, టీఎస్ ఐఐసీ ఎండీలు, నగర చీఫ్‌ సిటీ ప్లానర్ (సిసిపి), జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఈ లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఒకవైపు ఇంజనీరింగ్ సిబ్బంది కొరత తీర్చడంతోపాటు మరోవైపు నిధులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఆర్ధిక సహకారం, బ్యాంకుల నుంచి రుణాల సేకరణ వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఈ సమీక్షలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే 77 కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వర్షాకాలంలో నీళ్లు నిలిచి, ట్రాఫిక్ జాంలకు కారణమైన సుమారు 350 రోడ్డు వల్నరబుల్ పాయింట్లను అధికారులు గుర్తించారని, ఈ ప్రాంతాల్లో వైట్ టాపింగ్ రోడ్లు వేసేందుకు సుమారు రూ. 130 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ మొత్తం పనులు వచ్చే వర్షకాలానికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు.

1771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS