బడ్జెట్‌లో రాష్ర్టానికి పెద్దపీట వేయాలని కోరాం: కేటీఆర్Wed,January 11, 2017 07:19 PM
బడ్జెట్‌లో రాష్ర్టానికి పెద్దపీట వేయాలని కోరాం: కేటీఆర్


న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో రాష్ర్టానికి పెద్దపీట వేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ అశోక్ లావాసాని కలిసి సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌కు నిధులు కేటాయించాలని కోరామని వెల్లడించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి అయోగ్ సూచించిన రూ.20వేల కోట్ల నిధులను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, ఎంపీ బూరనర్సయ్యగౌడ్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సమావేశమై చేనేత రంగం అభివృద్ధి, క్లస్టర్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ విషయమై కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి స్మృతిఇరానీని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జౌళీ శాఖ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మార్చిలో సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు స్మృతిఇరానీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించాలన్న అంశాన్ని స్మృతిఇరానీ అభినందించినట్లు తెలిపారు. వారంలో ఒక రోజు చేనేత వస్ర్తాలు ధరించేలా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నూతన ఆవిష్కరణలపై నీతి ఆయోగ్ సీఈవోతో తన అభిప్రాయాలు పంచుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆవిష్కరణలు, సులభతర వాణిజ్య విధానం, వ్యాపారంలో నాణ్యత పెంపుపై చర్చించినట్లు పేర్కొన్నారు.

1014
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS