కేటీఆర్ రోడ్ షో..కొడంగల్ గులాబీమయం

Wed,November 21, 2018 05:23 PM

Ktr road show in kodangal

ఇసుకేస్తే రాలనంత జనం.. ఇవాళ కొడంగల్ సెంటర్‌లో కనుచూపుమేరలో జనప్రవాహం.. బిల్డింగులపైన, చెట్లపైనా ఎటుచూసినా జనమే. కేటీఆర్ రోడ్ షోకు యావత్ కోడంగల్ నియోజకవర్గం తరలి వచ్చింది. ఇప్పటివరకు కొడంగల్‌ను ఏలిన నేత, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ నియోజవర్గం పరువును మంటగల్పిన రేవంత్‌రెడ్డిపై కసితీర్చుకునేందుకు ఇవాళ టీఆర్‌ఎస్‌కు జనం జేజేలు పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఆభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న తీరుకు జనం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అందుకు ఈ రోడ్‌షోనే నిదర్శనం.

వికారాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ పట్టణంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి తరపున కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనాలు ఇండ్లు, భవనాలపైకి ఎక్కి కేటీఆర్ రోడ్ షోను తిలకించారు. కేటీఆర్ రోడ్ షోతో కొడంగల్ పట్టణమంతా గులాబీమయమైంది.
4221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles